1200 కిలోల బాణాసంచా సీజ్

Wed,October 18, 2017 10:34 AM

న్యూఢిల్లీ: అక్రమంగా బాణాసంచా అమ్ముతున్న వారిపై ఢిల్లీ పోలీసులు కొరడా రుళుపించారు. దేశ రాజధానిలో సుమారు 1200 కేజీల బాణాసంచాను సీజ్ చేశారు. ఇదే కేసులో 29 మందిని అరెస్టు చేశారు. బాణాసంచాపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించిన నేపథ్యంలో.. స్థానిక పోలీసులు ఈ సడన్ ఆపరేషన్ నిర్వహించారు. నవంబర్ ఒకటవ తేదీ వరకు ఢిల్లీలో బాణాసంచా షాపులకు అనుమతి లేదు అని పోలీసులు తెలిపారు. అరెస్టులతో పాటు అనేక షాపులను కూడా మూసివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే బాణాసంచా షాపులపై దాడులు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ ప్రతినిధి మాథుర్ వర్మ తెలిపారు. నగరంలోని సర్దార్ బజార్, లాహోరీ గేట్ల ప్రాంతాల నుంచి అయిదుగురు ఫైర్‌క్రాకర్స్ సెల్లర్స్‌ను అరెస్టు చేశారు. మిగితా ప్రాంతాల్లో జరిపిన ఆకస్మిక దాడుల ద్వారా కూడా అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మొత్తం 21 కేసులు కూడా నమోదు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టపాకులు అమ్మే ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంగళవారం నుంచి తమ వ్యాపారాన్ని నిలిపేశారు.

1047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles