పుల్వామా ఉగ్రదాడి ఓ ప్రమాదమే..: కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్ సింగ్

Tue,March 5, 2019 12:48 PM

Digvijaya Singh calls Pulwama terror attack an accident

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌పై ట్విటర్‌లో విమర్శలు చేసే క్రమంలో పుల్వామా ఉగ్రదాడిని ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోల్చి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

భద్రతా దళాల ధైర్యసాహాసాలను చూసి గర్వపడుతున్నాం.వారిపై పూర్తి న‌మ్మ‌కం ఉంది. ఎంతో మంది జవాన్లు కుటుంబ సభ్యులను వదిలి వెళ్లి దేశ సరిహద్దులో మనందరి రక్షణ కోసం ఉంటున్నారు. అందులో నా దగ్గరి బంధువులతో పాటు సన్నిహితులు చాలా మంది ఉన్నారు. పుల్వామా 'ప్రమాదం' తర్వాత భారత్‌ వైమానిక దళం మెరుపుదాడులు చేసింది. కొన్ని విదేశీ మీడియా సంస్థలు దాడులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

మెరుపుదాడులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తాము సాధించిన విజయంగా చెప్పుకుంటున్నారని.. అది భద్రతా దళాల అసమాన సాహాసాలను అవమానించడమే అవుతుంది. దేశంలోని ప్రతీ పౌరుడు భారత సైన్యం, భద్రతా దళాలను ఎంత‌గానో గౌరవిస్తున్నారని దిగ్విజయ్‌ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

1122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles