వ్యతిరేకంగా ఓటు వేస్తే సభ్యత్వం కోల్పోతారని వారికి తెలుసు

Sun,July 14, 2019 12:24 PM

DK Shivakumar says I have confidence on all our MLAs

బెంగళూరు: విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. రాజీనామా చేసిన వారి డిమాండ్లు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆదివారం శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసం ఉంది. వాళ్లంతా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎన్నోఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. విశ్వాస పరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేస్తే వారి సభ్యత్వాన్ని కోల్పోతారని చట్టంలో స్పష్టంగా ఉంది. అసంతృప్త ఎమ్మెల్యేల డిమాండ్లను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో స‌మ‌స్య‌ల‌పై పులుల్లా పోరాడారు. సంకీర్ణ సర్కార్‌కు వారంతా సహకరిస్తారని, ప్రభుత్వాన్ని కాపాడుతారనే సంకేతాలు మాకు అందుతున్నాయని శివకుమార్‌ చెప్పారు.

896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles