తమిళనాడులో ప్రభావం చూపని బీజేపీ

Sun,May 19, 2019 09:44 PM

DMK Set For Comeback With Help From Congress Predicts Poll Of Polls

హైదరాబాద్ : తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌తో జతకట్టిన డీఎంకే 26 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. న్యూస్ 24-టుడేస్ చాణక్య సర్వే ప్రకారం డీఎంకే-కాంగ్రెస్ కూటమి 31 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. అన్నాడీఎంకే - బీజేపీ కూటమి కేవలం ఆరు స్థానాలకు పరిమితం కానున్నట్లు అంచనాలు వేసింది. న్యూస్ 18 ఇండియా - ఐపీఎస్‌వోఎస్ సర్వే ప్రకారం.. డీఎంకే - కాంగ్రెస్ 22-24 స్థానాలు, అన్నాడీఎంకే - బీజేపీ 14 నుంచి 16 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడులో మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 39. కాగా వేలూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నిక జరగలేదు. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేసి 37 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా రెండు స్థానాల్లో బీజేపీ, పీఎంకే గెలిచాయి.

920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles