లంచం రూ. 30.. ఏసీబీకి చిక్కిన డాక్టర్‌..

Sat,July 27, 2019 12:25 PM

Doctor arrested for accepting Rs 30 bribe for treating patients IN Maharashtra

ముంబై : రోగులకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యుడు లంచాల బాట పట్టాడు. చేతిలో డబ్బు పెడితే కానీ.. రోగిపై స్టెతస్కోప్‌ పెట్టడు ఆ డాక్టర్‌. లంచం ఇవ్వాలని రోగులను ఇబ్బంది పెడుతున్న ఆ వైద్యుడిని ఓ రోగి ఏసీబీ అధికారులకు పట్టించాడు. మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని కుర్‌లాప్‌ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో నితిన్‌ చివటే అనే వ్యక్తి డాక్టర్‌గా సేవలందిస్తున్నాడు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలంటే రూ. 30 లంచం ఇవ్వాలి. అంతే కాదు స్లైన్‌ బాటిల్‌ ఎక్కించాలంటే రూ. 100 ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నాడు. ఓ రోగి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికెళ్తే రూ. 30 లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం ఉచితంగా ఇవ్వాలి కదా? లంచం ఎందుకు అని డాక్టర్‌ను అతను ప్రశ్నించాడు. లంచం ఇస్తేనే వైద్యం అని డాక్టర్‌ చెప్పడంతో సదరు రోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రోగి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో డాక్టర్‌ నితిన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

1200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles