భర్త ప్రేయసికి, కుమారుడికి భార్య నిప్పు

Fri,November 8, 2019 03:12 PM

జైపూర్‌ : భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళకు, ఆమె కుమారుడికి నిప్పు పెట్టింది భార్య. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సందీప్‌ గుప్తా అనే వ్యక్తి డాక్టర్‌. ఈయనకు భార్య సీమా గుప్తా, తల్లి లక్ష్మణ్‌ గౌర్‌ ఉన్నారు. అయితే సందీప్‌ ఆస్పత్రిలో దీపా దేవి అనే మహిళ రిసెప్షనిస్టుగా పని చేస్తుంది. ఈ క్రమంలో సందీప్‌, దీపా మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే దీపాకు సందీప్‌.. బ్యూటీ పార్లర్‌ పెట్టించాడు. అంతేకాకుండా ఆమెకు వసతి గృహం తన సొంతడబ్బులతో ఏర్పాటు చేయించాడు డాక్టర్‌. ఈ విషయం భార్య సీమా, తల్లి గౌర్‌కు తెలిసింది. దీంతో దీపా నివాసముంటున్న ఇంటికెళ్లిన సీమా, లక్ష్మణ్‌ గౌర్‌.. ఇంటి బయట నుంచి లోపలికి కొన్ని రసాయనాలు చల్లి నిప్పంటించారు. దీంతో ఇంట్లో ఉన్న దీపా, ఆమె కుమారుడు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మొదట ఈ ఘటన యాధృచ్చికంగా జరిగి ఉండొచ్చని పోలీసులు భావించారు. కానీ మృతురాలి బంధువులు, చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో సందీప్‌ గుప్తా భార్య, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు.

2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles