చిరుత నుంచి తెలివిగా తప్పించుకున్న కుక్క..వీడియో

Mon,October 14, 2019 07:31 PM

ఓ కుక్క తన యజమాని ఇంటి మెట్ల వద్ద నిద్రపోతుంది. ఇంతలో ఓ చిరుత మెల్లగా ఆ ఇంటి గుమ్మంవైపుకొచ్చింది. ఎలాంటి శబ్దం చేయకుండా చిరుత జాగ్రత్తగా కుక్క దగ్గరగా వచ్చి దాని పీకను పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోనే కుక్క అప్రమత్తమైంది. తన పీక కొరికేందుకు యత్నించిన చిరుతకు కుక్క ఝళక్కిచ్చి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కుక్క పారిపోయిన తర్వాత వీడియో పుటేజీ లేకపోవడంతో..ఇంతకీ ఆ కుక్క బతికుందా..చిరుత చేతిలో చిక్కుకుందా అనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలెట్టారు. వీడియోను చూస్తుంటే మొత్తానికి ఆ కుక్క చిరుతకు చిక్కలేదనే విషయం అర్థమవుతోంది. గుజరాత్ లోని అమ్రేలిలో ఈ ఘటన జరిగింది.


7219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles