మద్యం మత్తులో పామును ముక్కలుగా కొరికేశాడు..

Mon,July 29, 2019 01:44 PM

లక్నో : మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడిని పాము కాటేసింది.. దీంతో తిరిగి ఆ పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడు సదరు వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటవా జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రాజ్‌ కుమార్‌ అనే యువకుడు ఆదివారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కాసేపటికే పాము అతన్ని కరిచింది. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ యువకుడు.. తిరిగి ఆ పామును ముక్కలు ముక్కలుగా కొరికేసి కసి తీర్చుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన రాజ్‌కుమార్‌ను ఆయన తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

4316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles