38 కోట్లు దుర్వినియోగం.. ఫారూక్ అబ్దుల్లాను విచారించిన ఈడీ

Wed,July 31, 2019 06:01 PM

ED questions Farooq Abdullah in money laundering case

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం, ఎన్సీపీ నేత ఫారూక్ అబ్దుల్లాను ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ పోలీసులు విచారించారు. జ‌మ్మూక‌శ్మీర్ క్రికెట్ సంఘంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన కేసులో ఫారూక్‌ను ప్ర‌శ్నించారు. చంఢీఘ‌డ్ ఆఫీసులో విచార‌ణ జ‌రిగింది. మాజీ సీఎం మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌శ్మీర్ క్రికెట్ సంఘంలో సుమారు 38 కోట్ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్లు 2015లో సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఫారూక్ అబ్దుల్లాతో పాటు మ‌రో ముగ్గురి పేర్ల‌ను చార్జ్‌షీట్‌లో చేర్చారు. బీసీసీఐ ఇచ్చిన నిధుల‌ను దుర్వినియోగం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స్కాం జ‌రిగిన స‌మ‌యంలో ఫారూక్ అబ్దుల్లా క్రికెట్ సంఘానికి అధ్య‌క్షుడిగా ఉన్నారు. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ స‌లీమ్ ఖాన్‌, ట్రెజ‌ర‌ర్ అషాన్ మీర్జా, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బాషిర్ అహ్మ‌ద్‌లు కూడా ఉన్నారు.

893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles