మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ విడుదల

Sat,September 21, 2019 08:50 AM

న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవాళ విడుదల కానుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ రెండు రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జార్ఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మహారాష్ట్ర, హర్యానాలో దీపావళి(అక్టోబర్‌ 27) పండుగ కంటే ముందే ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండడంతో ఆ రెండు రాష్ర్టాల్లో ఎన్నికల కోడ్‌ నేటి నుంచి అమల్లోకి రానుంది. హర్యానాలో 90, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాలకు 2014లో అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్‌ 20న నోటిఫికేషన్‌ రాగా, అక్టోబర్‌ 15న పోలింగ్‌, 19 ఫలితాలు వెలువడ్డాయి. జార్ఖండ్‌కు 2014లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 23వ తేదీ వరకు కొనసాగాయి.


533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles