ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

Sun,May 26, 2019 08:53 PM

encounter in chhattisgarh maoist died

- ఎమ్మెలే భీమా మాండవి మృతికి కారణమైన ఓ మావోయిస్టు మృతి
- దంతెవాడ జిల్లాలో ఘటన

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తుపాకుల మోతమోగింది. పోలీసులు - నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు హతమయ్యాడు. తెలిసిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కిరణ్‌టూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిరోలీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి.

కాసేపటికి భద్రతా బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు పక్కనే ఉన్న అటవీ మార్గంలోకి పరారయ్యారు. ఘటనలో ఇటీవల దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవి మృతికి కారణమైన మావోయిస్టు గుట్టి మృతి చెందినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టుపై రూ.లక్ష నగదు రివార్డు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనలో మరి కొందరు నక్సల్స్ గాయపడినట్లు తెలుస్తోంది.

సంఘటన స్థలం నుంచి పోలీసులు గుట్టి మృతదేహంతో పాటు ఒక 9 ఎంఎం పిస్తోల్, ఆరు రౌండ్ల మాగ్జిన్‌ను స్వాధీన పరుచుకున్నారు. ఈ ఆపరేషన్ డీఆర్జీ బలగాలు, మహిళా కమాండో టీమ్ ఆధ్వర్యంలో జరిగింది.

3620
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles