చిదంబరానికి లుక్‌ఔట్‌ నోటీసులు..

Wed,August 21, 2019 11:41 AM

Enforcement Directorate issues lookout notice against Chidambaram

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి. చిదంబరం మెడకు ఉచ్చు బిగుస్తోంది. చిదంబరానికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో.. ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని సీబీఐ, ఈడీ అధికారులు ఎదురుచూస్తున్నారు. అయితే చిదంబరం అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇక మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. చిదంబరానికి లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో చిదంబరం విదేశాలకు వెళ్లకుండా ఈడీ చర్యలు తీసుకుంది. ఇవాళ ఉదయం చిదంబరం నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లి వచ్చినప్పటికీ ఆయన ఆచూకీ తెలియలేదు.

చిదంబరం తరపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. చిదంబరం పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ ప్రస్తావించారు. చిదంబరం పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనానికి ఎన్వీ రమణ ధర్మాసనం పంపింది. కపిల్‌ సిబాల్‌ వాదనల తర్వాత సీజేఐ ధర్మాసనానికి ఎన్వీ రమణ పంపారు. వాదనలను సీజేఐ ముందు వినిపించాలని జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం సూచించింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సీజేఐ ముందు ప్రస్తావనకు రానుంది చిదంబరం పిటిషన్‌.955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles