రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య

Fri,April 26, 2019 10:55 AM

Engine trouble on our flight to Patna today says Rahul Gandhi

హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ పాట్నాకు బయల్దేరారు. మార్గమధ్యలోనే రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఆయన ట్వీట్ చేశారు. దీంతో మళ్లీ ఢిల్లీకి తిరిగి వెళ్తున్నామని పేర్కొన్నారు. సమస్తిపూర్(బీహార్), బాలాసోర్(ఒడిశా), సంగంనేర్(మహారాష్ట్ర)లో జరగాల్సిన ఎన్నికల సభలు కొంచెం ఆలస్యంగా జరుగుతాయని.. ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని రాహుల్ ట్వీట్ చేశారు.1102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles