చిన్మయానందకు వ్యతిరేకంగా పెన్‌డ్రైవ్‌లో ఆధారాలు అందజేత

Wed,September 11, 2019 04:00 PM

Evidence Against BJP's Chinmayanand In Pen Drive, Claims UP Student

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత చిన్మయానందకు వ్యతిరేకంగా ఆధారాలను బాధితురాలు పెన్ డ్రైవ్‌లో తన స్నేహితురాలి చేత సిట్‌కు అందజేసింది. చిన్మయానంద తనను బెదిరించి, వీడియోలు తీసి ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడ్డట్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని ఆరోపించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు సంస్థ సిట్ బృందం మహిళను 15 గంటలకు పైగా విచారించింది. గతవారం పోలీసులు నమోదు చేసిన బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. ష‌హ‌జాన్‌పూర్ న్కాయ కళాశాలలో చేరే ముందు కాలేజీ డైరెక్టర్ గా ఉన్న చిన్మ‌యానంద‌ను క‌లిశాను. అప్పుడు అత‌ను ఫోన్ నెంబ‌ర్ తీసుకున్నాడ‌ని, కాలేజీ లైబ్ర‌రీలో ఉద్యోగం కూడా ఆఫ‌ర్ చేశాడ‌ని తెలిపింది. తొలుత హాస్ట‌ల్‌లో సీటు ఇప్పిండాని, ఆ త‌ర్వాత ఆశ్ర‌మానికి ర‌మ్మ‌న్నాడ‌ని చెప్పింది. హాస్ట‌ల్‌లో స్నానం చేస్తుంటే వీడియో తీసి త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేశాడ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత రేప్ చేసి వీడియో తీసి ప‌దేప‌దే అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది.

1472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles