జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Sun,March 17, 2019 11:43 AM

Ex CBI JD Laxminarayana Joins Janasena Party in Presence of Pawan Kalyan

విజయవాడ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. లక్ష్మీనారాయణకు జనసేన నుంచి ఎంపీ సీటు ఇవ్వనున్నారని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆయన అధికార టీడీపీలో చేరుతారని వార్తలు వినిపించాయి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఒక మార్పు కోసం పవన్‌ కల్యాణ్‌ వచ్చారు. జనసైనికుల్లో నేనూ ఒక సైనికుడిగా మారాను. సేనాధిపతి మార్గదర్శకంలో ముందుకెళ్తాం. జనసేనలో పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

2167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles