మాజీ ఎంపీ శివప్రసాద్‌కు కేంద్ర మాజీ మంత్రి పరామర్శ

Fri,September 20, 2019 05:42 PM

చెన్నై : చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ శివప్రసాద్‌ను కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివప్రసాద్‌కు అత్యవసర చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కొంత విషమంగా ఉందని చింతా మోహన్ చెప్పారు.


వదంతులు నమ్మొద్దు
కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్‌ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే శివప్రసాద్ మరణించినట్టు వస్తున్న వార్తలను ఆయన అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు. శివప్రసాద్‌కు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, అధికారికంగా తాము ప్రకటించే వరకు వదంతులను నమ్మొద్దని నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు.

1674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles