రాజస్థాన్‌లో హస్తం ఖతం!

Sun,May 19, 2019 07:33 PM

Exit Poll Rajasthan Clean sweep for BJP

హైదరాబాద్ : రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనట్లు కనిపిస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం డీలా పడిందని చెప్పొచ్చు. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితం కానున్నట్లు ఇండియా టుడే సర్వేలో తేలింది. భారతీయ జనతా పార్టీ 23 నుంచి 25 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో తెలుస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73, ఇతరులు 26 స్థానాల్లో గెలుపొందారు. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

1792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles