ల‌డాఖ్‌లో భార‌త్, చైనా ఆర్మీ మ‌ధ్య ఉద్రిక్త‌త‌

Thu,September 12, 2019 12:43 PM

Face-off between India, China soldiers in Ladakh

హైద‌రాబాద్‌: భార‌త‌, చైనా ఆర్మీలు మ‌రోసారి ఎదురుప‌డ్డాయి. ల‌డాఖ్‌లోని ప్యాన్‌గాంగ్ సో వ‌ద్ద పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న భార‌త ఆర్మీ బృందాన్ని చైనా ఆర్మీ అడ్డుకున్న‌ది. దీంతో అక్క‌డ కొంత ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. అయితే అత్య‌వ‌స‌రంగా చుస‌ల్ ప్రాంతంలో బోర్డ‌ర్ ప‌ర్స‌న‌ల్ మీటింగ్‌(బీపీఎం)ని ఏర్పాటు చేశారు. ఆ భేటీతో రెండు ద‌ళాల మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. గ‌త నెల‌లో క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత భార‌త్‌, చైనా మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత బ‌ల‌హీన‌ప‌డ్డాయి. ల‌డాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించ‌డాన్ని చైనా వ్య‌తిరేకించింది. ఐక్య‌రాజ్య‌స‌మితిలో క‌శ్మీర్‌కు వ్య‌తిరేకంగా పాక్ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు చైనా మ‌ద్ద‌తు కూడా ప‌లికింది. వాస్త‌వాధీన‌(ఎల్ఏసీ) వ‌ద్ద ఉద్రిక్త స‌హ‌జ‌మే అని, అయితే ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు బీపీఎంలు స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఆర్మీ చెప్పింది. మ‌రోవైపు ఈ అక్టోబ‌ర్‌లో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీకానున్నారు. వాస్త‌వానికి ప్యాన్‌గాంగ్ సో భాగంలో చైనా ఆధీన‌మే ఎక్కువ‌. అక్క‌డ ఉన్న జ‌లాల‌పై రెండు దేశాల‌కు చెందిన స్పీడ్ బోట్లు పెట్రోలింగ్ చేస్తుంటాయి.

1227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles