ఎన్సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా డ్యాన్స్..వీడియో వైరల్

Fri,May 24, 2019 11:41 AM

Farooq Abdullah dances at party office in jammu


జమ్మూకశ్మీర్ : నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్ సీ)చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా శ్రీనగర్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ లో రెండు స్థానాల్లో ఎన్ సీపీ గెలుపొందింది. మరో స్థానంలో కౌంటింగ్ జరుగుతుండగా ఎన్ సీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూలోని ఎన్ సీ పార్టీ ఆఫీసు వద్ద సంబురాలు మిన్నంటాయి. ఫరూక్ అబ్దుల్లా తన పార్టీ మద్దతుదారులు, అనుచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. విజయోత్సవ సంబురాల్లో ఫరూఖ్ అబ్దుల్లా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.1687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles