చలాన్ల ఎఫెక్ట్‌.. బైక్‌ అడుగుతున్నాడని గదిలో బంధించారు..

Wed,September 11, 2019 11:51 AM

Fearing challan parents lock up minor boy wanting to drive bike he calls cops

లక్నో : తన కుమారుడు బైక్‌ అడుగుతున్నాడని ఓ తండ్రి అతడిని గదిలో నిర్బంధించాడు. మైనర్లు వాహనం నడిపితే ట్రాఫిక్‌ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో చలాన్ల భయంతో తల్లిదండ్రులు.. పిల్లలకు బైక్‌లు, ఇతర వాహనాలు ఇచ్చేందుకు జంకుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ధరమ్‌ సింగ్‌ తన కుమారుడి ఒత్తిడి మేరకు కొన్నాళ్ల క్రితం బైక్‌ను ఇప్పించాడు. బైక్‌ తీసుకుని కుమారుడు.. రోడ్లపై దోస్తులతో షికారు చేస్తున్నాడు. అయితే తమ కుమారుడు బైక్‌ నడుపుతూ పోలీసులకు పట్టుబడితే.. భారీగా జరిమానా విధిస్తారని భయపడిన తండ్రి.. అతడిని ఓ గదిలో నిర్బంధించాడు. మైనర్‌కు బైక్‌ కీస్‌ ఇచ్చేందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో నిర్బంధంలో ఉన్న కుమారుడు.. తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ధరమ్‌ సింగ్‌ ఇంటికి చేరుకుని.. తండ్రికొడుకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ నెల 1వ తేదీ నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహనాల చట్టం 2019 ప్రకారం.. జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం మైనర్లు వాహనం నడిపితే.. సంరక్షకుడు లేదా వాహన యజమానికి రూ. 25 వేల జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు.

2570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles