మాజీ కేంద్ర మంత్రిపై అత్యాచార ఆరోప‌ణ‌లు

Wed,September 11, 2019 11:30 AM

Filmed, blackmailed, raped, law student charge against BJPs Chinmayanand

హైద‌రాబాద్‌: మాజీ కేంద్ర మంత్రి చిన్మ‌యానంద‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. చిన్మ‌యానంద‌ త‌న‌ను బెదిరించాడ‌ని, వీడియోలు తీసి, అత్యాచారం చేశాడ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ న్యాయ‌శాస్త్ర విద్యార్థిని ఆరోపించింది. పోలీసులు విచార‌ణ‌లో ఆమె ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది. కానీ ఆ రాజ‌కీయ నేత‌పై ఎటువంటి ఫిర్యాదు న‌మోదు కాలేద‌న్నారు. ఒక సంవ‌త్స‌రం పాటు త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని న్యాయ విద్యార్థిని పోలీసుల‌కు చెప్పింది. చిన్న‌యానంద పేరిట యూపీలో అనేక ఆశ్ర‌మాలు, విద్యాసంస్థ‌లు ఉన్నాయి. సుప్రీంకోర్టు నియ‌మితి సిట్ ముందు కూడా ఆ విద్యార్థిని బీజేపీ నేత‌పై ఆరోప‌ణ‌లు చేసింది. ష‌హ‌జాన్‌పూర్ కాలేజీలో చేరే ముందు చిన్మ‌యానంద‌ను క‌లిశాన‌ని, అప్పుడు అత‌ను ఫోన్ నెంబ‌ర్ తీసుకున్నాడ‌ని, కాలేజీ లైబ్ర‌రీలో ఉద్యోగం కూడా ఆఫ‌ర్ చేశాడ‌ని ఆమె తెలిపింది. తొల‌తు హాస్ట‌ల్‌లో సీటు ఇప్పిండాని, ఆ త‌ర్వాత ఆశ్ర‌మానికి ర‌మ్మ‌న్నాడ‌ని చెప్పింది. హాస్ట‌ల్‌లో స్నానం చేస్తుంటే వీడియో తీసి త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేశాడ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత రేప్ చేసి వీడియో తీసి కూడా ప‌దేప‌దే మోసం చేశాడ‌ని లా విద్యార్థిని కోర్టు క‌మిటీ ముందు వెల్ల‌డించింది.

681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles