జ‌ర్న‌లిస్టుల‌కు లంచం.. బీజేపీ నేత‌ల‌పై ఎఫ్ఐఆర్‌

Thu,May 9, 2019 02:47 PM

FIR filed against 2 BJP leaders in Leh bribery case

హైద‌రాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు తమకు లంచం ఇవ్వజూపారంటూ కొందరు పాత్రికేయులు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి కూడా బయటికొచ్చింది. ఆ కేసులో ఇవాళ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. జ‌మ్మూక‌శ్మీర్ బీజేపీ యూనిట్ చీఫ్ ర‌వీంద‌ర్ రైనాతో పాటు మ‌రో నేత‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. మే 2వ తేదీన జ‌రిగిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి విరుద్ధంగా బీజేపీ నేత‌లు వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జ‌ర్న‌లిస్టుల‌పై కేసు న‌మోదు చేయాల‌ని లేహ్‌కు చెందిన చీఫ్ జుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ పోలీసుల‌ను ఆదేశించారు.

977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles