150 మంది విహెచ్‌పీ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్..

Thu,October 10, 2019 12:19 PM

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 150 మంది విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. అక్టోబర్ 8న ఆయుధ పూజలో భాగంగా వీహెచ్‌పీ కార్యకర్తలు, భజరంగ్‌దళ్ కార్యకర్తలు సంయుక్తంగా బహిరంగ స్థలంలో, జన సమూహమున్న ప్రదేశంలో తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారి నినాదాలతో అక్కడి ప్రాంతాన్నంతా హోరెత్తించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఈ చర్యలకు పాల్పడినందుకు గానూ, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు గానూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.



829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles