ముంబయి ఓఎన్‌జీసీలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

Tue,September 3, 2019 09:35 AM

ముంబయి : మహారాష్ట్ర నవీ ముంబయిలోని ఉరాన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లోని కోల్డ్‌ స్టోరేజీలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఓఎన్‌జీసీ అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న 50 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ ప్రమాదం వల్ల ఆయిల్‌ ప్రాసెసింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని సిబ్బంది తెలిపింది. ఇక గ్యాస్‌ను హజిరా ప్లాంట్‌కు మళ్లించారు.1090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles