కుంభమేళాలో అగ్నిప్రమాదం

Tue,February 5, 2019 03:30 PM

Fire breaks out in two tents at Kumbh Mela in Prayagraj

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళాలో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గుడారాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గుడారాల్లో ఉన్న కొంత నగదు పూర్తిగా కాలిపోయింది. కాలిపోయిన నోట్లలో కొత్త రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50 నోట్లు అధికంగా ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జనవరి 14న కుంభమేళా ప్రదేశంలోని దిగంబర్‌ అకాడ శిబిరంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన కుంభమేళా మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది.1319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles