జాల‌ర్ల‌ ప‌డ‌వ బోల్తా.. 26 మంది మృతి

Thu,July 4, 2019 09:54 AM

fishing boat capsizes in Honduras, 26 killed

హైద‌రాబాద్‌: క‌రీబియ‌న్ దీవుల్లోని హోండుర‌స్ దేశంలో ప‌డ‌వ బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 26 మంది మ‌ర‌ణించారు. వాతావ‌ర‌ణం స‌రిగా లేని కార‌ణంగా.. స‌ముద్ర పీత‌ల‌ను ప‌ట్టే జాల‌ర్ల బోటు మునిగిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్ర‌మాదం నుంచి మ‌రో 47 మందిని ర‌క్షించారు. క‌రీబియ‌న్ తీరంలోని మాస్కిటా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. లాబ్‌స్ట‌ర్ ఫిషింగ్‌పై నిషేధం ఎత్తివేయ‌డంతో అక్క‌డ జాల‌ర్లు మ‌ళ్లీ చేప‌ల వేట‌కు వెళ్లారు. 70 ట‌న్నుల బ‌రువు ఉన్న బోటు మునిగిన‌ట్లు చెప్పారు. అయితే ప్ర‌మాదానికి కార‌ణంగా ఇంకా తెలియ‌రాలేదు.

1592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles