కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి..ఒకరు మృతి..వీడియో

Thu,March 14, 2019 08:20 PM

Foot Overbridge Near MCST Railway Station Collapses 1 Died


ముంబై : ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ (సీఎస్ఎంటీ) రైల్వేస్టేషన్ కు సమీపంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..23మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించామని ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో..ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ముంబై పోలీసులు సూచనలు జారీచేశారు. ఇవాళ ఉదయం ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మరమ్మతులు చేశారని, అయినా జనాలు దానిపై నుంచే వెళ్తున్నారని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు.2642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles