మాజీ ఎమ్మెల్యేను.. రైలులో కాల్చి చంపారు

Tue,January 8, 2019 12:14 PM

అహ్మాదాబాద్: రైలులో ప్ర‌యాణిస్తున్న మాజీ ఎమ్మెల్యేను .. పిస్తోల్‌తో కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో జ‌రిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ‌యంతిలాల్ భానుషాలిని రైలులోనే హ‌త్య చేశారు. స‌య్యాజి న‌గ‌ర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. భుజ్ నుంచి అహ్మ‌దాబాద్ నుంచి వ‌స్తుండ‌గా మ‌ర్డ‌ర్ జ‌రిగింది. క‌టారియా సుర్‌బారి రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపారు. ఈ మ‌ర్డ‌ర్‌పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఒక బుల్లెట్ ఆయ‌న ఛాతిలోకి దిగింది. మ‌రో బుల్లెట్ ఆయ‌న కంట్లోకి దూసుకెళ్లింది. మాలియా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద రైలును రెండు గంట‌ల పాటు ఆపేశారు. ఏసీ ఫ‌స్ట్ క్లాస్ బోగీలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఈ మ‌ర్డ‌ర్ జ‌రిగింది. ఆ మాజీ ఎమ్మెల్యే రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. హ‌త్యా ఘ‌ట‌న ప‌ట్ల పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు సీఎం విజ‌య్ రూపానీ తెలిపారు.

2431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles