నాగుపామును భయపెట్టిన పిల్లులు.. వీడియో

Mon,September 16, 2019 05:45 PM

నాగుపాము అంటే అందరికీ హడల్.. దాన్ని చూసిన వెంబడే పరుగెడుతాం.. కానీ విషపూరితమైన ఆ నాగుపామును నాలుగు పిల్లులు భయపెట్టాయి. ఆ పిల్లులు.. పులుల్లా నాగుపామును తదేకంగా చూస్తూ.. దానికి వణుకు పుట్టించాయి. ఈ నాలుగింటిలో ఒకటి నల్ల పిల్లి ఉంది. ఆ నల్ల పిల్లే పామును బాగా భయపెట్టింది. పాము పడగలేపి ముందుకు వస్తున్నప్పటికీ.. నల్ల పిల్లి మాత్రం భయపడకుండా కాలు లేపి గర్జించేలా మారింది. దీంతో చేసేదేమీ లేక పిల్లులకు భయపడి నాగుపాము అక్కడ్నుంచి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను నటుడు నేయిల్ నితిన్ ముఖేష్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు.

2035
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles