కర్ణాటకలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

Mon,September 2, 2019 10:47 AM

బెంగళూరు : కర్ణాటకలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మైసూర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles