గుహ‌వ‌తి ఘాట్‌లో పేలుడు

Sat,October 13, 2018 01:34 PM

గుహవతి: అస్సాంలోని గుహవతిలో పేలుడు జరిగింది. షుకలేశ్వర్ ఘాట్ వద్ద ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఉంది. పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవాళ ఉద‌యం 11.45 నిమిషాల‌కు పేలుడు జ‌రిగింద‌ని జాయింట్ సీపీ దిగంత బోరా తెలిపారు. న‌ది వ‌ద్ద ఉన్న ఘాట్‌లో పేలుడు చోటుచేసుకుంద‌న్నారు. పేలుడులో ఉగ్ర చ‌ర్య లేద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. ప్ర‌స్తుతం అక్క‌డ బాంబు డిస్‌పోజ‌ల్ స్క్వాడ్ ప‌రిస‌రాల‌ను చెక్ చేస్తోంది. పేలుడు ఘ‌ట‌న‌కు సంబంధించి ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు.

1055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles