ప్రత్యేక ఆకర్షణ.. చంద్రయాన్‌ 2 గణపతి.. వీడియో

Sat,August 31, 2019 12:30 PM

ముంబయి : వినాయక చవితి రాగానే పలు వీధుల్లో పలు రకాలుగా ఉండే గణేశ్‌ ప్రతిమలు దర్శనమిస్తాయి. ప్రత్యేకంగా ఆకట్టుకునే వినాయక ప్రతిమలను చూసేందుకు జనాలు ఉత్సాహం చూపిస్తారు. ఇక ఈ ఏడాది ముంబయిలోని లాల్‌ బగ్చా దేవాలయంలో వినాయకుడిని ప్రత్యేకంగా రూపొందించారు. చంద్రయాన్‌ 2 ఉపగ్రహాం విశేషాలను తెలిపే విధంగా ఈ గణేశ్‌ ప్రతిమను రూపొందించారు. గణేశ్‌ విగ్రహానికి ఇరు వైపులా ఇద్దరు వ్యోమగాములను కృత్రిమంగా ఏర్పాటు చేశారు. తల వెనుక భాగంలో చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని ఉంచారు. ఈ వినాయకుడి ప్రతిమ వెనుక భాగంలో ఓ తెరను ఏర్పాటు చేసి సౌర కుటుంబంలో గ్రహాల వ్యవస్థను తెలియజేస్తున్నారు. చంద్రయాన్‌ 2కు సంబంధించిన విశేషాలను పూర్తిగా వివరించేలా స్క్రీన్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ వినాయకుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

1294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles