ఉప్పొంగిన గంగానది..ముంపులో 6 గ్రామాలు

Tue,September 24, 2019 04:47 PM


బీహార్: భారీ వర్షాలకు బీహార్‌లో గంగానది ఉప్పొంగుతోంది. గంగానది నుంచి వరదనీరు పోటెత్తడంతో లఖిసరాయ్ జిల్లా పరిధిలోని 6 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకునిపోయాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరుకోవడంతో భారీ మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. ఇండ్లలోకి వరద నీరు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరద ముంపు నేపథ్యంలో గ్రామాల్లో పలు రకాల వ్యాధులు విజృంభించే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాలు ముంపులో చిక్కుకుని సమస్యల నిలయంగా మారినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


1087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles