ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందే.. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌

Mon,February 11, 2019 01:19 PM

Government should fulfill promise of special status to Andhra Pradesh without delay, says Manmohan Singh

న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఆ రాష్ట్ర సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో ధ‌ర్నా చేస్తున్నారు. ఆ ధ‌ర్నాకు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ద్ద‌తు ప‌లికారు. మ‌రింత ఆల‌స్యం చేయ‌కుండా ఆ హామీని నెర‌వేర్చాల‌ని మ‌న్మోహ‌న్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌ధానిగా ఉన్న మ‌న్మోహాన్ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. పార్ల‌మెంట్‌లో అన్ని పార్టీలు ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు తెలిపాయ‌ని మ‌న్మోహ‌న్ అన్నారు. సీఎం బాబుకు తాను సంఘీభావం తెలుపుతున్న‌ట్లు చెప్పారు. ప్ర‌త్యేక హోదా ప్రామిస్‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌న్నారు. ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల వెంటే తాము ఉన్నామ‌న్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు పార్ల‌మెంట్ అంగీక‌రించింద‌ని కాంగ్రెస్ నేత ఆనంద్ శ‌ర్మ తెలిపారు.

3486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles