వరల్డ్‌వైడ్‌ ట్రెండింగ్‌లో మోదీ పుట్టినరోజు

Tue,September 17, 2019 03:13 PM

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు 69వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ప్రపంచంలోనే విశేష ఆదరణ కలిగిన నేత మోదీ.. ఆయన పుట్టినరోజు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ సృష్టిస్తోంది. హ్యాష్‌ట్యాగ్‌ బర్త్‌డే మోదీ పేరుతో ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరిస్తున్న వరుసలో మూడో స్థానంలో నిలిచింది. కొన్ని మిలియన్ల ప్రజలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, సినీ తారలు, నెటిజన్స్‌ ఈ జాబితాలో ఉన్నారు.


మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఇప్పటివరకు 11 లక్షల 37 వేల మంది ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు. ఇండియాలో టాప్‌-10 ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో మోదీ పుట్టినరోజుకు సంబంధించినవే ఏడు ఉండడం గమనర్హం. సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరి బీచ్‌లో మోదీ భారీ బొమ్మ గీసి, తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్న పిల్లలు సైతం పాట రూపంలో ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలుపడం విశేషం.






896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles