రేపు నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో జైట్లీ అంత్యక్రియలు

Sat,August 24, 2019 03:42 PM

Harsh Vardhan lays a wreath on mortal remains of ArunJaitley on behalf of Prime Minister Narendra Modi.

ఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంత్యక్రియలను రేపు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి పార్థివదేహాన్ని కైలాష్‌ కాలనీలో జైట్లీ నివాసానికి తరలించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జైట్లీ భౌతికకాయం ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు అరుణ్ జైట్లీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. 2:30 గంటలకు నిగమ్‌బోధ్‌ ఘాట్ లో జైట్లీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనకు పార్థివదేహాన్ని కార్యాలయంలో ఉంచుతారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోదీ తరఫున బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి హర్షవర్దన్‌, సీనియర్ నాయకులు అద్వాని జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు.

979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles