ఈ బడ్జెట్ దేశ ప్రగతికి మార్గం: ప్రధాని మోదీ

Fri,July 5, 2019 02:37 PM

he budget for a New India has a roadmap to transform the agriculture sector of the country this budget is one of hope

ఢిల్లీ: ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రగతికి మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ... తాజా బడ్జెట్ దేశ ప్రజల ఆశలు... ఆకాంక్షలు నెరవేరుస్తుందని అనుకుంటున్నాను. నవభారత నిర్మాణానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. వ్యవసాయరంగంలో పలు సంస్కరణలు చేపట్టాం. వ్యవసాయరంగానికి మేలు చేసిదిగా ఈ బడ్జెట్ నిలుస్తుంది. మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. యువత కలలు, సంకల్పం నెరవేరేలా బడ్జెట్ రూపొందించాం. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర పెంచే విధంగా బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ విద్యావిధానాన్ని బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దేశం నిరాశా వాతావరణం నుంచి బయటపడిందన్నారు. బడ్జెట్ సులభతరహా జీవన విధానానికి ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు.

1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles