భారీ వర్షం, వడగళ్లు..వీడియో

Fri,May 17, 2019 06:39 PM

Heavy Rain, Hailstorm Hits Bengaluru today


బెంగళూరు : బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం కుండబోత వర్షంతోపాటు వడగళ్లు పడ్డాయి. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ లోని ఎంజీ రోడ్, కబ్బన్ పార్క్, ఇతర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అప్పటివరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులు..హఠాత్తుగా వాతావరణ మార్పులు సంభవించి..భారీ వర్షం పడటంతో కాస్త ఉపశమనం పొందారు. కొన్ని ప్రాంతాల్లో తమ చేతుల్లో పడ్డ వడగళ్ల ఫొటోలు, వీడియోలను బెంగళూరు వాసులు ట్విట్ఱర్ లో షేర్ చేశారు. మరోవైపు దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.
7416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles