ముంబైలో రెడ్ అలర్ట్..వరద ముంపులో రోడ్లు..వీడియో

Wed,September 4, 2019 03:03 PM


ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో రోడ్లపైకి వరద నీరు చేరుకుంటోంది. నవీముంబైలోని రోడ్లు, పల్ఘర్ జిల్లాలోని నల సోపారా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలతో ముంబైలోని సియోన్ ఏరియాలో ప్రధాన మార్గాలు నీటితో నిండిపోయాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు సియోన్ రైల్వే స్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ఐఎండీ ఇప్పటికే ముంబై, థానే, పల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయే అవకాశాలున్నాయిని ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ హోసలికర తెలిపారు. భారీ వర్షాలతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముంబైలో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.







8120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles