వరదల్లో వందలాది మంది..కొనసాగుతున్న సహాయక చర్యలు

Sun,May 26, 2019 08:05 PM

Heavy rain strikeout tripura over 700 people homeless


త్రిపుర: త్రిపురలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉరుములు, ఎరుపులతో కూడిన భారీ వర్షం ధాటికి 700 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వీరిలో కొంతమంది ఉనకొట్టి జిల్లా, మిగిలిన వారు ఉత్తర త్రిపుర, ధాలై జిల్లాలకు చెందినవారని, వారిని పునరావాస శిబిరాలకు తరలించామని త్రిపుర అత్యవసర ఆపరేషన్స్ విభాగం అధికారులు తెలిపారు. వర్షం ధాటికి 1,039 ఇళ్లు దెబ్బ తిన్నట్లు అధికారులు వెల్లడించారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 40 పడవలల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

11198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles