మాయావతిని గౌరవించాలి : ములాయం

Fri,April 19, 2019 01:43 PM

I am happy to share the stage with Mayawati says Mulayam

హైదరాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. 24 ఏళ్ల తర్వాత ఒకే వేదికను ములాయం సింగ్‌ యాదవ్‌, మాయావతి పంచుకున్నారు. మెయిన్‌పూరిలో ఎస్పీ నాయకుడు ములాయం సింగ్‌ తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములాయం సింగ్‌ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ మాయావతిని గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొన్నేళ్ల తర్వాత మాయావతితో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెయిన్‌పూరి నా కర్మభూమి అని పేర్కొన్నారు. ఎస్పీ - బీఎస్పీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ ముందు నిలబడడం ఇదే చివరిసారి. మరోసారి తనపై మీ గౌరవాన్ని, ప్రేమను చూపించాలని ములాయం కోరారు.

881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles