ఎగ్జిట్ పోల్స్ ను నమ్మను : సీఎం మమత

Sun,May 19, 2019 09:31 PM

I do not trust Exit Poll gossip says CM Mamata Banerjee

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కనిపిస్తోంది. మొత్తం 42 స్థానాలున్న బెంగాల్‌లో బీజేపీ 19-22, టీఎంసీ 19-23 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే పేర్కొంటుంది. అన్ని సర్వేలను చూస్తే తృణమూల్ కాంగ్రెస్ 26 సీట్లకు పైగా సాధించలేదు అని చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితం కావొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌ ఊహాగానాలను తాను నమ్మను అని మమత ట్వీట్ చేశారు. ఈ ఊహాగానాల ద్వారా ఈవీఎంలను మార్చి అవకతవకలకు పాల్పడాలని కుట్ర చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అధికార పార్టీ ఆగడాలపై పోరాడేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా ఉండాలని మమత పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. నాటి నుంచి బెంగాల్‌లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

1516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles