అభినందన్‌ వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారం

Wed,August 14, 2019 10:46 AM

IAF Wing Commander Abhinandan Varthaman to be conferred with Vir Chakra on Independence Day

న్యూఢిల్లీ : భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్కాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌ను యుద్ధసేవ అవార్డుతో సత్కరించనున్నారు. ఫైట‌ర్ విమానాలు జ‌రిపిన డాగ్‌ఫైయిట్‌లో.. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన అభినంద‌న్‌కు చెందిన మిగ్-21 పాక్‌లో కూలింది. పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలను తరుముతూ వెళుతున్న క్రమంలో అతడు ప్రయాణిస్తున్న మిగ్-21 బైసన్ విమానం దారితప్పింది. పాక్‌కు చెందిన ఎఫ్‌-16ను అభి నేల‌కూల్చాడు. మార్చి 1వ తేదీన అత‌న్ని పాక్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత సెలవుల్లో ఉన్న అభినందన్ తిరిగి విధుల్లో చేరారు.1516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles