మహిళా కానిస్టేబుల్‌ను వెంబడిస్తున్న ఐబీ అధికారి..

Wed,November 13, 2019 04:42 PM


ముంబై: మహిళా కానిస్టేబుల్‌ను వెంబడిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళాకానిస్టేబుల్ (34), ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రూపేశ్‌కుమార్ కు పోస్టింగ్ వచ్చింది. ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. అయితే కొంతకాలం తర్వాత మహిళాకానిస్టేబుల్ పంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయింది. అప్పటినుంచి ఆమె రూపేశ్‌కుమార్‌తో మాట్లాడటం ఆపేసింది. కానీ రూపేశ్ కుమార్ మాత్రం కొన్ని రోజులుగా ఆమెను ఫాలో అవుతున్నాడు. దీంతో బాధిత మహిళా కానిస్టేబుల్ పంత్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అంటోప్ హిల్‌లోని ఇంట్లో ఉన్న రూపేశ్‌కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 354 డీ కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని ఎస్‌ఐ సంజయ్ బాలేరావు తెలిపారు.

3982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles