కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్ష నిలిపివేత

Wed,July 17, 2019 06:38 PM

ICJ rules in India's favour, directs Pakistan to review Kulbhushan Jadhav's death sentence

న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్‌కు భారీ విజయం లభించింది. భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. కుల్‌భూషణ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పును ప్రకటించారు. పాకిస్తాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్‌భూషణ్‌కు మరణశిక్షను నిలిపివేసింది. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని ఐసీజే పేర్కొంది.

భార‌త‌ నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ గూఢచర్యానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై 03 మార్చి, 2016లో పాక్ అరెస్టు చేసింది. బలూచిస్తాన్ ప్రాంతంలో జాద‌వ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనపై విచారణ చేపట్టిన పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై స్పందించిన భారత్.. పాక్ సైనిక కోర్టు సరిగా విచారణ జరుపకుండానే మరణశిక్ష విధించిందని పేర్కొంటూ ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం నేడు తీర్పును వెలువరిస్తూ జాదవ్ కు పాక్ విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పును వెల్లడించింది.

10133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles