రాష్ట్రపతి పాలన మహారాష్ట్రకు అగౌరవం

Fri,November 8, 2019 11:27 AM

ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. మహా పీఠం తమదే అని శివసేన చెబుతుంటే.. ఆ పీఠం తమదే అంటూ బీజేపీ చెబుతుంది. దీంతో సీఎం ఎవరనే విషయంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాష్ట్ర ప్రజలకు అగౌరవంగా ఉంటుందని శివసేన సీనియర్‌ నాయకులు సంజయ్‌ రౌత్‌ తెలిపారు.


ప్రభుత్వంలో 50:50 వాటాతోపాటు సీఎం పదవిని చెరో రెండున్నరేండ్లు పంచుకోవాలన్న డిమాండ్‌కే శివసేన కట్టుబడి ఉన్నది. తమ పార్టీకి సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకునేందుకు తాము సిద్ధమని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇదిలా ఉంటే ఉద్ధవ్ నివాసం మాతోశ్రీలో గురువారం జరిగిన శివసేన శాసనసభా పక్షం.. ప్రభుత్వ ఏర్పాటు విషయమై తుది నిర్ణయాధికారాన్ని పార్టీ అధినేతకు అప్పగిస్తూ తీర్మానించింది. బీజేపీతో మితృత్వాన్ని తెగదెంపులు చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి.

1948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles