ఐఎండీ వార్నింగ్‌.. ముంబైలో సెలవు

Tue,July 2, 2019 09:25 AM

హైద‌రాబాద్‌: ముంబై ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇవాళ కూడా భారీ స్థాయిలో వ‌ర్షాలు కురువ‌నున్నాయి. భార‌తీయ వాతావ‌ర‌ణ‌శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో ప్ర‌భుత్వం ఇవాళ సెలవు ప్ర‌క‌టించింది. ముంబై సిటీ, ముంబై స‌బ‌ర్బ‌న్‌, థానే జిల్లాల్లో ఇవాళ ప్ర‌భుత్వ స్కూళ్లు, కార్యాల‌యాల‌కు సెలవు ప్ర‌క‌టించారు. ఐఎండీ వార్నింగ్ నేప‌థ్యంలో సెలవు ప్ర‌క‌టించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ మాత్రం ప‌నిచేస్తుంద‌ని బీఎస్ఈ సీఈవో ఆశిశ్ కుమార్ తెలిపారు. సాధార‌ణ ప‌ద్ధ‌తిలోనే స్టాక్ మార్కెట్లు న‌డుస్తాయ‌న్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో ముంబై తీరం వెంట భారీ స్థాయిలో అల‌లు ఎగిప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. సుమారు 5 మీట‌ర్ల మేర ఎత్తున అల‌లు ఎగిసిప‌డుతాయ‌ని ఐఎండీ అధికారులు చెప్పారు. ఐఎండీ శాటిలైట్ చిత్రాన్ని విడుద‌ల చేసింది. మ‌హారాష్ట్ర‌లోని ముంబై తీరం ద‌ట్ట‌మైన మేఘాల‌తో క‌మ్ముకుని ఉన్న‌ది. ముంబైతో పాటు ద‌క్షిణ గుజ‌రాత్‌లో భీక‌రంగా వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయి.2657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles