పవన్‌ను ఏపీ సీఎంగా చూడాలి : మాయావతి

Fri,March 15, 2019 03:22 PM

హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) - జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో పోటీ చేస్తాయని మాయావతి, పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌ను చూడాలని ఉందన్నారు. త్వరలోనే తమ ఎన్నికల ప్రచారాన్ని ఏపీలో ప్రారంభిస్తామన్నారు. సీట్ల పంపకం పూర్తి కావొచ్చిందని మాయావతి తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మాయావతిని ఈ దేశానికి ప్రధానిగా చూడాలని ఉందన్నారు. ఇది తన కోరిక అని పవన్ అన్నారు.

2380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles