జనవరి 22.. నా జీవితంలో మరువలేనిది

Tue,January 14, 2020 04:26 PM

న్యూఢిల్లీ: జనవరి 22 తన జీవితంలో మరిచిపోలేనిదని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాకు తెలిపారు. గత 7 ఏళ్లుగా.. మేము అనుభవిస్తున్న భాద వర్ణణాతీతమమని ఆమె తెలిపారు. కాగా, తమ ఉరిశిక్షను మరోసారి పరిశీలించాలని నిర్భయ కేసులోని ఇద్దరు దోషులు వినయ్‌ కుమార్‌ శర్మ, ముఖేష్‌ సింగ్‌ కోర్టులో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో నలుగురు దోషులకు ఉరి ఖరారైనట్లే. ఆ నరరూప రాక్షసులకు ఉరిశిక్ష ఖరారవడంతో న్యాయం ఇంకా బతికే ఉన్నట్లు నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. కాగా, ఈ నెల 22న నిర్భయను అతి ఘోరంగా హత్యాచారం చేసిన దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించాలని ఆదేశించిన విషయం విదితమే. తీహార్‌ జైల్లో వారిని ఉరితీయనున్నారు.
1632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles