సుబ్బ‌రాజు బ‌ర్త్‌డేని ఘ‌నంగా జ‌రుపుకున్న జ‌పాన్ వాసులు

Thu,February 28, 2019 12:01 PM

japaneese celebrates subbaraju birthday celebrations in japan

బాహుబ‌లి2 చిత్రంలో కుమార వ‌ర్మ పాత్ర పోషించి అందరిని అల‌రించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు . సినిమా మొద‌ట్లో అమాయకంగా క‌నిపించి చివ‌రిలో ధైర్యంగా పోరాడ‌డం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. బాహుబ‌లి 2 సినిమాతో సుబ్బరాజుకి మ‌న‌దేశంలోనే కాకుండా విదేశాల‌లోను ఫుల్ క్రేజ్ పెరిగింది. ఆ మ‌ధ్య బాహుబ‌లి 2 స్పెష‌ల్ స్క్రీనింగ్ కోసం జ‌ప‌నీస్ ఆయ‌న‌కి ఆహ్వానం ప‌లికారు. ఆయ‌న ఎంట్రీతో ఆడిటోరియాలు దద్ద‌రిల్లాయి. ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి గౌర‌వం ఈయ‌నకే ద‌క్కింది. బాహుబ‌లి 2 చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ప్ర‌భాస్, రానా, అనుష్క క‌న్నా సుబ్బ‌రాజుని జ‌ప‌నీస్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డడం విశేషం. తాజాగా ఆయ‌న బ‌ర్త్‌డే(27.02.19) వేడుక‌ల‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్ క‌ట్ చేసి వేడుక జ‌ర‌ప‌డంతో పాటు ప‌లు గిఫ్ట్స్, గ్రీటింగ్స్ ఆయ‌న‌కి పంపారు. వారున్న ప్ర‌తి చోట సుబ్బ‌రాజు ఫోటోల‌ని ఉంచి ఆయ‌న‌పై త‌మ‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు. జ‌పాన్‌లో జ‌రిగిన సుబ్బ‌రాజు బ‌ర్త్‌డే వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త‌న‌పై ఇంత ప్రేమ చూపిస్తున్న జ‌పాన్ వాసులకి సుబ్బ‌రాజు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపారు సుబ్బ‌రాజు.


3749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles